నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం* మండలంలోని కమ్మపల్లి గ్రామానికి చెందిన గుర్రం చంద్రమౌళి నాయుడు (గుర్రం చంద్రశేఖర్ నాయుడు) ఇటీవల మృతి చెందారు. తాను జన్మించిన గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచనతో అతని కుటుంబ సభ్యులు రూ.30 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు అనంతరం చంద్రశేఖర్ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ ను నిర్మించడం ఆయన జ్ఞాపకాలను ఎల్లప్పుడూ గ్రామంలో సువర్ణార్చాలతోనిలిచే విధంగా చంద్రమౌళి నాయుడు సతీమణి ఇంద్రాణి వారి కుటుంబ సభ్యులు గౌతం, సుప్రియ లను ఆమె అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు, తెదేపా మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంఠ చౌదరి, మాజీ ఎంపీపీ కేశవులునాయుడు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.





