Thursday, March 19, 2026

* *రైతు సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం :కొట్టే శివకుమార్,, క్లస్టర్ఇంచార్జి* *చిన్నగొట్టిగల్లు* మండలంలోలాభసాటి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిన్నగొట్టిగల్లు లో ” రైతన్న.. మీకోసం ‘ కార్యక్రమం నిర్వహించారు.. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తుంది చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నానీ అన్న గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు…అందులో భాగంగా చిన్న గొట్టిగ ల్లు లో జరిగిన ఈ కార్యక్రమంలో కొట్టే శివకుమార్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు అన్ని రకాలైన పథకాలను అమలు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా వేలాది మంది రైతులను ఆదుకుంటుందని, సబ్సిడీ ద్వారా యంత్రాలను, సబ్సిడీ ధరకు ఎరువులను, విత్తనాలను పంపిణీ చేస్తుందన్నారు. రైతుల కోసం అన్ని రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు వీటిని రైతులు తెలుసుకొని ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని కోరారు.. సాగు పద్ధతులను మార్చుకోవాలని ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి ప్రస్తుతం డిమాండ్ పెరిగిందని వీటి సాగు పట్ల రైతులు దృష్టి సారించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయాకుడు సండ్ర మోహన్ రెడ్డి, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News