Thursday, March 19, 2026

*దేశానికి అన్నంపెట్టే రైతును గౌరవంగా చూడాలి* *ఇదే ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పం, కూటమి ప్రభుత్వం ఆశయం**అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతలకు ఆర్థిక భరోసానిస్తుంది**రైతన్నల జీవితాలలో వెలుగులు నిప్పుతుంది**చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిత్తూరు -*నవంబర్ 24-11-25మనిషి మనుగడకు మూలస్తంభంగా నిలిచి,.. దేశానికే పట్టెడు అన్నం పెడుతున్న అన్నదాతను గౌరవించాలన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం.., కూటమి ప్రభుత్వం ఆశయం అన్నారు. నేలను దున్ని మట్టినుండి అన్నాన్ని బయటకు తీసిన తొలి శాస్త్రవేత్త రైతును మనమందరం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ – పి.యం.కిసాన్ పథకానికి సంబంధించి, రెండవ విడత నగదును ఈ నెల 19న రైతన్నల ఖాతాల్లోకి జమ చేసిన కూటమి ప్రభుత్వం.., అన్నదాత సుఖీభవ – పి.యం.కిసాన్ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని సంకల్పించింది. అంతేకాకుండా అన్నదాతలను ఈ పథకంలో భాగస్వామ్యం చేసేందుకు వారంరోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం లక్ష్యాన్ని , ఢిల్లీలో ఉన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అన్నదాతల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించడంతో పాటు వారి శ్రేయస్సు కోసం ఎన్నో సంస్కరణలను తీసుకొస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అంటూ ఆయన కొనియాడారు. నాగటి చాళ్లలో దేశ భవితను చూపించిన తొలి దార్శనికుడు రైతు అని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…, తాను తింటూ పదిమందికి పెడుతూ అందరూ సుఖంగా బతకాలని కోరుకునే తొలి సమసమాజ సిద్ధాంతకర్త రైతు అని ప్రశంసించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవసాయ బడ్జెట్‌లో రూ 48,340 కోట్లు కేటాయించి, వ్యవసాయానికి పెద్దపీట వేసిందన్నారు. ఎన్నికల హామీలో భాగమైన అన్నదాత సుఖీభవ పథకం కోసం ఏటా రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించేందుకు రూ.9,400 కోట్లు కేటాయించడం రైతులపట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులను రైతన్నల ఖాతాల్లోకి జమ చేసి, వారిలో ఆర్థిక భరోసా నింపి, తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల అన్నదాతకు అండగా నిలవడమే కాక వారికి తక్షణ ఉపశమనం కలిగించడం, వ్యవసాయాన్ని లాభదాయకం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, రైతన్నల జీవితాలలో వెలుగులునిప్పేందుకు వీలవుతుందని ఎంపీ దగ్గుమళ్ళ వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News