Thursday, March 19, 2026

ఇందిరమ్మ చీరల పంపిణీ..నాణ్యతపై మహిళలు హర్షం..ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టీ చీర అందజేత..ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఎం శ్రీనివాస్..

నేటి సాక్షి పాలేరు , నవంబర్ 24 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కోలాహలం మధ్య జరిగింది. ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాలకు మీ రేవంతన్న కనుక అని కవర్ లోగో ఉన్న కవర్లో చీరలను పెట్టీ అందజేశారు.. తొలుత తురకగూడెం గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమంలో ఎపిఎం శ్రీనివాస్ పాల్గొని మహిళలకు చీరలను అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని దృడ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని స్వయం సహాయక సంఘాల మహిళలకు అలాగే 18 ఏళ్ళు నిండి రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు చీర అందిస్తామని తెలిపారు.. గ్రామ విఓ ల ద్వారా ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టీ చీర అందిస్తారని అన్నారు.. ఎవరికి చీరలు రాలేదు అనే భయం వద్దు అందరికీ తప్పకుండా చీర అందిస్తారని అన్నారు.. ఈ చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణ ఆడబిడ్డల గౌరవం అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ శ్రీను , విఓ కన్నెబోయిన వినోద , కాంగ్రెస్ నాయకులు కొమ్ము ప్రభాకర్ రావు, బుర్ర రజిత , గణపారపు మల్సూరు, మాజీ సర్పంచ్ కన్నెబోయిన కౌసల్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News