నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………..విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం సభ్యులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.నూతన కార్యవర్గానికి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలు తెలిపారు.విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు.*మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ*తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో పాటుగా విశ్రాంతి ఉద్యోగస్తులు కూడా ప్రధానపాత్ర పోషించారు.ఆనాడు సకలజనుల సమ్మెలో భాగంగా యావత్ తెలంగాణ సమాజం రాజకీయాలకతీతంగా ఉద్యమించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏమైతే ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాము మన రాష్ట్రం మనకు ఏర్పడ్డయితే మనం స్వరాష్ట్రంలో ఆశయాలు ఆకాంక్షలు హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందని,తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం,ఆనాడు చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజకీయంగా ఒరిదుడుకులు ఎదుర్కొన్న గాని ఆంద్రప్రదేశ్ లో పార్టీ ఉనికి కోల్పోతుంది అని ఊహించి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చటం ప్రధాన బాధ్యతగా భావించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ దక్కుతుంది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆనాడు 2014లో కేసీఆర్ గారికి అవకాశం వచ్చింది.దురదృష్టం ఏమిటంటే విద్యార్థులు నిరుద్యోగ యువత వారి సమస్యలు సమస్యలుగానే ఉండిపోవడం,ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల సమస్యలు కానీ లేక విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలే కానీ సమస్యలు ఆశించిన మేరకు పరిష్కారం పొందలేకపోవడంతోని మార్పు కోరడం జరిగింది.*అందరి మద్దతుతోనే తెలంగాణ సాధిచుకున్నాం*ఆ మార్పులు భాగంగా మొన్నటి శాసనసభ ఎన్నికలలో మీ అందరి మద్దతుతోని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషించింది.అదే విధంగా విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉన్నారు.విశ్రాంతి ఉద్యోగస్తులది కూడా ప్రధాన పాత్ర పోసించారు. విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలు వారు జీవితకాలం సేవలు అందించి వారి జీవితం చివరి అంకంలో వారి కుటుంబాన్ని స్థిరపరచుకోవాలని వారి బాధ్యతలు నిర్వహించుకోవాలి అనే తలంపు తోని వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక విధంగా వారికి లభించాల్సిన హక్కులు,మీ సర్వీస్ కాలంలో సేవింగ్స్ గాని సౌకర్యాలు కానీ మీకు లభించాల్సి ఉంటుంది.గతానికి ఇప్పటికీ వ్యత్యాసం గతంలో మనకు పెన్షన్ నెలలో మొదటిరోజు పొందుతున్నాం బ్యాంక్ ఇన్స్టాల్ మెంట్స్ ఇతర సమస్యలు తలెత్తకుండా గతంలో లాగా ఇబ్బంది కలగకుండా మొదటిరోజు ప్రభుత్వం ఇస్తుంది.దానితోపాటు మనకు రావలసిన ఏరియేస్ జీవితకాలం సర్వీస్ లో ఉండగా సేవింగ్ చేసుకున్నామో రిటైర్మెంట్ తోని పొందలేకపోతున్నాంప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులతోని వాయిదాల పద్ధతితోని సమస్యలు ఎదుర్కొంటున్నాం.పిఆర్సి సర్వీస్ ఉద్యోగస్తులకు ఎంత ప్రధానమో విశ్రాంతి ఉద్యోగస్తులకు కూడా పిఆర్సి అంతే ప్రధానం.పిఆర్సి జాప్యం కావడంతోని మనం ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం తప్పకుండా పిఆర్సి సాధ్యమైనంత తొందరలో నిర్ణయింప చేసే విదంగా కానీ మీకు రావాల్సిన మీ సేవింగ్స్ తరితగతలో వచ్చే విదంగా నా వంతు కృసి చేస్తాను అన్నారు. *ఆరోగ్య భద్రత రాజ్యాంగం కల్పించిన హక్కు*వైద్య సదుపాయాలకు సంబంధించి ఏ విధంగా నిరుపేద వర్గాలకు ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందో విశ్రాంతి ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందించడం ప్రధానం అని అన్నారు.మీ సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు.





