నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)వెదురుకుప్పం డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.లావణ్య కుమారి మరియు వై.ఆర్.సి కోఆర్డినేటర్ ఎం.ఇస్మాయిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు.ప్రిన్సిపల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద మాట్లాడుతూ హిమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించామని రక్త గ్రూప్ ను తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు.రక్తం మార్పిడి సమయంలో రక్త గ్రూపు ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు జరిపి, వారికి ఎంత శాతం రక్తం ఉందో తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇందులో వెదురుకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎం.ఎల్. హెచ్.పి.సుమాసాగరి, ఆశా కార్యకర్త ఎస్.గీత,ఆర్ఆర్సి మరియు వైఆర్సి కమిటీ మెంబర్స్,అధ్యాపక ఆధ్యాపకేతన బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





