Thursday, March 19, 2026

మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కమిషనర్ కార్యాలయం ముట్టడి

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 24, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికుల అధ్వానంలో సోమవారం అధ్వానంలో సోమవారం కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 54,000 మంది పనిచేస్తున్నారన్నారు. అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వివరించారు. నేటికీ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో ఇబ్బందుల గురిచేస్తున్నారన్నారు. కార్మికులు అనేక అప్పులు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక అవస్థ పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పరిష్కారం కొరకై పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కోడిగుడ్లను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. 9 10 తరగతి లకు అల్పాహార బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 600 రూపాయలు ఇస్తున్నది. సమాన పనికి సమాన వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. అక్షయ పాత్ర ను వెంటనే రద్దు పరచాలన్నారు లేనియెడల మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికుల చెన్నమ్మ లక్ష్మమ్మ, ఎల్లమ్మ రమేష్ మొగులమ్మ రాములు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News