నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ లు కమిషనర్ ను కోరారు. రెడ్డి అండ్ రెడ్డి కాలనీ లోని పెరుమాళ్ హాస్పిటల్ వద్ద చెత్త ఎక్కువగా ఉంది తొలగించాలని, నారాయణపురం విద్యుత్ స్థంబాలు మార్చాలని, భూగర్భ డ్రైనేజ్ లీకేజీ లను అరికట్టాలని, మారుతి నగర్ లో ఆక్రమణ నిర్మాణలు అరికట్టాలని, తిమ్మినాయుడు పాలెం లోని రెండు ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, న్యూ బాలాజీ కాలనిలో అక్రమ నిర్మాణలు అరికట్టాలని, టిడ్కో ఇండ్ల కొరకు డబ్బులు కట్టాము ఇంకా ఇవ్వలేదు మాకు ఇల్లులు ఇప్పించాలని, టిడిఆర్ బాండ్లు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.





