Thursday, March 19, 2026

*ప్రపంచమే మన పాఠశాల అని సత్యసాయి బాబా విశ్వసించారు*- “. *మానవ సేవే మాధవ సేవ”:-బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్*

నేటి సాక్షి నవంబర్ 24 పాములపాడు :–సత్య సాయి బాబా తన జీవిత సందేశంగా “మానవ సేవే మాధవ సేవ” (మానవునికి సేవ చేయడం దేవునికి సేవ చేయడమే) అనే సూత్రాన్ని అనుసరించి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలను ప్రారంభించారనీ, ఆయన స్థాపించిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవలు కొనసాగుతున్నాయనీ బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. మండల కేంద్రమైన పాములపాడులోనీ, శివాలయంలో మండల భజన మండలి సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలువేసి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భజన మండలి సంఘం అధ్యక్షులు భోజనం నాగేశ్వరరావు, గురూజీ వానాల నాగేశ్వరరావు లు మాట్లాడుతూ ప్రేమే మార్గం సత్యమే జీవం మానవజాతికి ఒక మంచి ఉత్తమమైన మార్గాలు తెలిపిన వ్యక్తి,అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించబడ్డాయి. వీటిలో గుండె, మూత్రపిండాలు మరియు ఇతర క్లిష్టమైన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు కుల, మత, వర్ణ బేధం లేకుండా అందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భజన మండలి గురూజీలు ఆవులయ్య, గోపాలకృష్ణయ్య, శ్రీనివాసులు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News