నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 24,మరికల్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్ సి కాలని లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగండ్ల నాగప్ప గారి సతీమణి అయిన నల్లగండ్ల కిష్ఠమ్మ గారు మరణించడం జరిగినది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న , సూర్య చంద్ర ఫౌండేషన్ అధినేత, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి గారు ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి 5000 వెయిల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగినది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగినది. వీరి వెంట మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె ఆంజనేయులు , చెన్నయ్య,తిర్మలయ్య, సీమ గోపాల్, పొలెమోని రామకృష్ణ, టైసన్ రఘు, బోయ వెంకటేష్,సీమ కమల్, ఆంజప్ప బోయ రాములు, శివ, సుదర్శన్ రెడ్డి, రఘు యాదవ్, బోయ రఘు, సద్దాం, బాబు తదితరులు నివాళులు అర్పించడం జరిగినది.





