నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా కోరుట్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ మరియు అభియాన్ జిల్లా కో-కన్వీనర్ సుధవేణి మహేష్ ఆధ్వర్యంలో జరిగింది.*దేశభక్తి కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలి*: చెన్నమనేని వికాస్ రావుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ..’బంకిం చంద్ర చటర్జీ’ రచించిన ఈ గేయం స్వాతంత్ర పోరాటంలో ఉత్తర నుంచి దక్షిణం వరకు దేశాన్ని ఒకే జెండా కింద నడిపించింది. బ్రిటిష్ రాజును కూలదోసేందుకు చిరస్మరణీయ ధైర్యం, జోష్ నింపిన గేయం ఇది. ఈ గేయం ప్రతి పల్లె, ప్రతి పాఠశాలకు చేరాలనే పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అందుకే దేశం కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే సిద్ధత ప్రతి పౌరుడిలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు,అభియాన్ కన్వీనర్ సూదవేణి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, ఎర్ర రాజేందర్, పార్లమెంట్ కో-కన్వీనర్ గుంటుక సదాశివ్, మాజీ కౌన్సిలర్లు మాడవేని నరేష్, పెండం గణేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెళ నవీన్, సాడిగే మహేష్, సీనియర్ నాయకులు మాసం ప్రసాద్, తిరుమల వాసు, గందె నవీన్, గిన్నెల శ్రీకాంత్, తోట రాజేశం, గుద్దేటి రాజేందర్, రాధారపు సత్యనారాయణ, ఓం ప్రకాష్, కచ మల్లేష్, మ్యాకల గణేష్, కంఠం శ్రీనివాస్, రాగంశెట్టి సాయి కృష్ణ, కథలాపూర్ మండల నాయకులు, బూత్ ప్రెసిడెంట్లు మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.____





