Thursday, March 19, 2026

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయి నారాయణపేటజిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్…..

నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 24,నారాయణపేట: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో క్రీడలు ప్రముఖ పాత్ర వహిస్తాయనీ నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి మొదటి మ్యాచ్‌ను ప్రారంభించి, స్వయంగా క్రికెట్‌ ఆడి ఆటగాళ్లతో కలిసి క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఎస్పీ బ్యాటింగ్ చేయడంతో స్టేడియంలో హర్షధ్వానాలు మార్మోగాయి.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…“క్రీడలు క్రమశిక్షణ, టీమ్‌వర్క్, సహనాన్ని పెంపొందిస్తాయి. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు యువతనీ సరైన దిశగా నడిపిస్తాయి. యువతలో ప్రతిభను వెలికితీయడం, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడం కోసం ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ముఖ్యమని” అన్నారు.ఈ ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్‌లో జిల్లా వ్యాప్తంగా 30 టీమ్స్ పాల్గొంటుండటంతో పాటు మీడియా రెవెన్యూ, పోలీసు, మీడియా, డాక్టర్లు, లాయర్ కూడా పాల్గొనడం విశేషం. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువత టీమ్‌లు పోటీపడుతున్న ఈ వేదిక ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులు, ఫ్రెండ్లీ వాతావరం అలవడుతుందని ఎస్పీ పేర్కొన్నారు. క్రీడాకారులు ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తిని, నైతిక విలువలను, శాంతి-పరస్పర గౌరవ భావనను పాటించాలని సూచించారు.యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడల వైపు దారి చూపడం ఇప్పుడు అత్యవసరం. ఇలాంటి కార్యక్రమాలు వారికి సరైన దృక్పథం, ఆరోగ్యకరమైన జీవనశైలి అందించడానికి గొప్ప సాధనం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News