నేటి సాక్షి .కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన నితిక పంత్ ఐపీఎస్ గారు ఈ రోజు జోడేఘాట్ లోని ఆదివాసి నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ముందుగా ఎస్పీ , ఎఎస్పీ లకు ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘన స్వాగతం పలికారు. ఆదివాసి నాయకులు కొమరం భీమ్ గారి విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఆతర్వాత కొమురం భీమ్ మ్యూజియాన్ని సందర్శించి , గిరిజన ఆచార సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అత్యంత మారుమూల గిరిజన ప్రజలకు కూడా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని అక్కడి పటేల్స్, ప్రజలతో తో అన్నారు. అనంతరం ఆదివాసీ పెద్దలు ఎస్పీ గారిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ ఏ.ఎస్.పి చిత్తరంజన్ ఐపిఎస్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కేరమేరి ఎస్.ఐ మధుకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





