నేటి సాక్షి బుగ్గారం.నక్క శంకర్ రిపోర్టర్ బుగ్గారం మండలం గోపులాపూర్ పల్లె ప్రకృతి వనం వద్ద సోమవారం నాడు గంజాయి తాగుతున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రం కగారియా జిల్లాకు చెందిన సూరజ్ వయసు(18) రాహుల్ వయసు (20) నుండి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని NDPS చట్టం కింద బుగ్గారం ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. మండలంలో గంజాయి వినియోగం, అమ్మకం నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.





