Thursday, March 19, 2026

కార్మికులు బీమా సదుపాయన్ని సద్వినియోగం చేసుకోవాలి — జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా మెదక్

నేటి సాక్షి (భూమయ్య)భవన , ఇతర నిర్మాణ కార్మికులు కార్మిక బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారుసోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈనెల 24 నుంచి వచ్చేనెల 8వ తారీకు వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల నుండి పది లక్షల వరకు పెంచారని, ప్రమాదవశత్తు పూర్తి శాశ్వత అంగవైకల్యంనకు 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం 4 లక్షలు, కార్మికుల పిల్లల వివాహ కానుకగా మొదటి ఇద్దరి కూతుళ్లకు 30,000, కార్మికుల మొదటి ఇద్దరి కూతుళ్లకు ప్రసూతి కానుకగా 30,000, రిజిస్ట్రేషన్ కాని కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే 50,000 తో పాటు ఇతర బీమా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కార్మికులు ఈ బీమా పెంపు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ సహాయ కార్మిక అధికారి సత్యేంద్ర ప్రసాద్, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News