( నేటి సాక్షి) నవంబర్ 25: ప్రతినిధి: శివకుమార్కాటేదాన్ ఐలాలో విచ్చల విడిగా వెలుస్తున్న భారీ షెడ్లు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్ కాటేదాన్ ఇండస్ట్రీయల్ ఏరియాలో విచ్చల విడిగా 111 జీవోకు విరుద్దంగా పదుల సంఖ్యలో భారీ షెడ్ల నిర్మాణాలు ఏదేచ్చగా సాగుతున్నాయి.ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టెందుకు ఆస్కారం లేదు. అయినను దర్జాగా షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.అక్రమ నిర్మాణాల పై ఐలా అధికారులకు ఎన్ని ఫిర్యాధులు అందినా కాముష్ ఉంటున్నారే తప్పు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసలు ఐలా అధికారులు ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు.ఐలా కార్యాలయానికి కమిషనర్ రారు,అక్రమ నిర్మాణాల పై పర్యవేక్షణ ఉండదు, అంతా కింది స్థాయి సిబ్బందే చూసుకుంటూ అక్రమార్కులతో కుమ్మక్కై అందిన కాడికి దండుకుంటూ అక్రమ నిర్మాణాలకు కావాల్సిన అన్ని పనులను వారి దగ్గర నుండి చక్కబెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్ ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించి కట్టడి చేయాలనీ అలాగే కిందిస్థాయి సిబ్బంది పై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.





