Thursday, March 19, 2026

*ప్రజా ప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకోవాలి*– *చవట గుంట సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)వెదురుకుప్పం;-మండలంలోని ప్రజా ప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు చేసుకోవాలని చవట గుంట సింగల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. నాయకులను ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఉన్న గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసిమెలిసి ముందుకు నడవాలని సూచించారు. స్థానిక శాసనసభ సభ్యులు డాక్టర్ వి ఎం థామస్ నేతృత్వంలో వెదురు కుప్పం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని హితవు పలికారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News