(నేటి సాక్షి)నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మధురా నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న అష్ట లక్ష్మీ సమేత ఆలయ నిర్మాణం కోసం నిజాంపేట కు చెందిన ప్రణవీ ఇన్ఫ్రా డేవలప్పర్స్ అధినేత ఎం నాగ మురళి కృష్ణ ఆలయ గర్భగుడి నిర్మాణం, గర్భగుడి శిఖర నిర్మాణం కోసం 3,00,000/- లక్ష్యల రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు, ముఖ్య అతిధిగా నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంట నగరాలలో అష్టలక్ష్మీ సమేత ఆలయాలు అరుదుగా ఉన్నాయన్నారు, మధురా నగర్ కాలనీలో అష్ట లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయం, దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుందని దాతలు ముందుకు వచ్చి వస్తురూపేనా,ధన రూపేణా సహకరించి ఆలయ నిర్మాణానికి తమ వంతుగా సహకరించాలన్నారు. ఆలయ గర్భగుడి నిర్మాణం,ఆలయ శిఖర నిర్మాణానికి ముందుకు వచ్చి 3 లక్ష్యల రూపాయలు విరాళంగా అందజేసిన ఎం.నాగ మురళి కృష్ణను ఆయన అభినందించారు, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశాడు,ఆలయ నిర్మాణంలో తన వంతు సహకారం అందిస్తానాని,ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఒక ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జి.విష్ణువర్ధన్ రావు,పి.రాంబాబు,సి హెచ్.లింగయ్య,హన్మంత్ రావు,చలసాని హేమంత్ రావు,ఆర్.ఏ.మద్దయ్య,రామ లక్ష్మారెడ్డి,ఆలయ ప్రధాన అర్చకులు మారుతి స్వామి తదితరులు పాల్గొన్నారు.





