ర్ నేటి సాక్షి, కొడిమ్యాలనవంబర్, 25జిల్లా ఉద్యాన అధికారి G. శ్యామ్ ప్రసాద్,జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్, ఆధ్వర్యం లోమంగళవారం కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామం లో గుమ్మడిదరి వెంకటి ఆయిల్ పామ్ తోటను సందర్శించి తగు సూచనలు చేశారు. మొక్కల చుట్టూ తేమ , గడ్డి మొలవకుండా ఆర్గానిక్ ముల్చ్ ల చెట్టు మట్టలు, ఉనక వేసుకోవడం జరిగింది. ఆయిల్ పామ్ లో అంతర్ పంట గ పసుపు, అల్లం పంటలు వేసుకోవడం జరిగింది. ఆయిల్ పామ్ లో అంతర్ పంట వేస్తూ, వినూత్న పద్ధతిలో మల్చింగ్ చేస్తున్న రైతు వెంకట్ నీ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి, ఉద్యాన విస్తరణ అధికారి N. అనిల్, రైతులు పాల్గొన్నారు.





