నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*గ్రామ కంఠానికి చెందిన భూమిలో కబ్జాకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అదే విధంగా బుధవారం తాసిల్దార్ కు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మండలంలోని అనుపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖల సర్వే నెంబరు 184/4 నందు సుమారు రెండు ఎకరాల 50 సెంట్లు బొప్పరాజు పల్లి జగనన్న కాలనీ అనుపల్లి క్రికెట్ పోటీలకు ఇతర క్రీడల పోటీలకు పంచాయతీలోని యువత వినియోగించుకుంటుండేవారు అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ఇదే స్థలంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులునిర్వహించేవారు రెవెన్యూ రికార్డుల ప్రకారం లో పేరండంగుళ్ళు నందు గ్రామకంఠంగా ,అనాధీనంగా నమోదు కాబడి ఉన్నది గతంలో ఈ స్థలంలో అనేకమంది ఆక్రమణలకు పాల్పడినప్పటికీ ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు అడ్డుకునేవారు అయితే గత కొద్ది రోజులుగా తిరుపతికి చెందిన జవాది సురేష్ ,జవాదికుమార్ లు కలసి ఈ స్థలంలో కొంతమేర కబ్జా చేశారు ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ తాసిల్దార్ స్పందించడం లేదని గ్రామస్తులు వాపోయారు దీంతో కబ్జాదారులు యదేచ్చగా రాత్రి యందు జెసిబిలను వినియోగించి చదును చేసి అక్రమంగా రేకుల కట్టడాలను నిర్మించారు గదుల నిర్మాణం చేపట్టడంతో రెవెన్యూ అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లిన కనీస స్పందన లేదన్నారు ఈ నేపథ్యంలో నిర్మాణం గదుల నిర్మాణం కొనసాగించడం పట్ల ఆగ్రహించిన గ్రామస్తులు, యువత జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి కబ్జాదారుల నుండి భూమిని స్వాధీనం చేసుకొని క్రీడలకు, ప్రభుత్వ వివిధ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని కోరుతూ అదే విధంగా న్యాయం చేయాలని చేయాలని వారు కోరారు





