Friday, March 20, 2026

*కోరుట్లలో డాక్టర్ సర్దార్ జఫరుల్లా అమీర్ కన్నుమూత** చికిత్సా రంగంలో సేవలందించిన ఆర్‌ఎంపీ వైద్యుని మృతికి ముస్లిం సమాజంలో విషాదం* కరీంనగర్ ప్రతిమా హాస్పిటల్‌లో తుదిశ్వాస—–*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణం నిజాంపురా (జామే మసీదు సమీపం) కు చెందిన ప్రముఖ ఆర్‌ఎంపీ వైద్యుడు జనాబ్ సర్దార్ జఫరుల్లా అమీర్ సాబ్ కరీంనగర్ ప్రతిమా హాస్పిటల్‌లో అకస్మికంగా మరణించారు. ‘ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్’ అంటూ ముస్లిం సమాజం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. మరణించిన అమీర్ సాబ్, స్థానికంగా పేరుపొందిన అమీర్ సాబ్ టీచర్ పెద్ద కుమారుడు. కోరుట్ల ఓల్డ్ బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఫజల్ , అబ్దుల్లా , హాఫిజ్ బర్కత్ లకు తండ్రి.!*సేవాభావంతో నిలిచిన వ్యక్తిత్వం*కోరుట్ల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా ఆర్‌ఎంపీ డాక్టర్‌గా సేవలందించిన జఫరుల్లా అమీర్ సాబ్ వైద్యం ద్వారా పేద బాధితులకు సహాయపడుతూ సానుభూతితో వ్యవహరించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆయన మరణవార్త తెలిసిన క్షణం నుండి నిజాంపురా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ముస్లిం సమాజం తరఫున ‘అల్లాహ్ తాలా మరహూం జఫరుల్లా అమీర్ సాబ్‌కు మగ్ఫిరత్ (క్షమ) ప్రసాదించి, జన్నతుల్ ఫిర్దౌస్‌లో ఉన్నత స్థానం ఇవ్వాలి. కుటుంబ సభ్యులకు ధైర్యం, సహనం ప్రసాదించాలి’ అంటూ ప్రార్థనలు చేశారు. పట్టణంలోని అనేక వర్గాల ప్రజలు కూడా కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News