నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 25,నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో మీడియా వర్సెస్ పోలీస్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా కొనసాగింది. ఇలాంటి క్రీడా పోటీలు సామాజిక సమన్వయం, క్రీడాస్ఫూర్తి, స్నేహబంధాన్ని పెంపొందించడానికి దోహద పడతాయని ఈ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించి కొద్ది సేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. ఎస్పీ మాట్లాడుతూ…“పోలిస్, మీడియా రెండూ సమాజానికి సేవ చేసే ముఖ్యమైన రంగాలు అని, ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు పరస్పర అర్థం చేసుకునే స్వభావాన్ని, టీమ్ స్పిరిట్‌ను మరింత పెంచుతాయి” అని అన్నారు. అయితే టాస్ గెలిచిన మీడియా జట్టు నిర్ణీత 8 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 44 రన్స్ చేశారు. అనంతరం 45 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పోలీసు జట్టు 6 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మీడియా టీమ్, పోలీస్ టీమ్‌లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాయి. ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హూల్ హాక్, డీపీరో ఎండీ రషీద్ ,సిఐ శివ శంకర్, డీ పీ ఆర్ ఓ రషీద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, ఎస్.ఐ. నరసింహ, ఎస్.ఐ లు వెంకటేశ్వర్లు, నరేష్, శివ శంకర్, జర్నలిస్టులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





