*రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర కీలకం** ప్రతి పౌరుడిగా రాజ్యాంగ విలువలను గౌరవించి దేశాభివృద్ధికి కృషి చేయాలి* రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలోతో ఘన నివాళులు* జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిప్రతి పౌరుడిగా రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, అందులో పోలీస్ శాఖ కీలక పాత్ర గురించి పోలీస్ సిబ్బందికి వివరించారు.1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం లేదా “సంవిధాన్ దివస్”గా జరుపుకుంటామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చి భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిందన్నారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భర్తీ చేసి, భారత సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా స్వతంత్ర రాజ్యాంగాన్ని తయారు చేయడం అవసరమైందన్నారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ 60కి పైగా దేశాల రాజ్యాంగాలను విశ్లేషించి తుది ముసాయిదాను సిద్ధం చేసిందన్నారు.పరాయి పాలన నుంచి విముక్తి తరువాత మన దేశానికి తగిన విలువలను ప్రతిబింబించే ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖితపూర్వక రాజ్యాంగంగా నిలిచిందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వేచ్ఛకు, రక్షణకు, ప్రజా హక్కులను లిఖితపూర్వకంగా నిర్ధారిస్తూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా “ప్రజలే సార్వభౌములు” అనే సూత్రాన్ని ప్రకటించిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం సాధనంగా రాజ్యాంగాన్ని మలిచారని తెలిపారు.మహనీయులు రూపొందించిన భారత రాజ్యాంగ విశిష్టత, ప్రాధాన్యత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు 2015 నుండి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. అప్పటి నుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థల్లో రాజ్యాంగ పీఠిక పఠనం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారన్నారు.రాజ్యాంగం దేశ నిర్మాణంలో పోషించిన మహత్తర పాత్రను స్మరించుకోవడమే కాకుండా, ప్రతి పౌరుడిగా రాజ్యాంగ విలువలను గౌరవించి, వాటిని జీవితంలో ఆచరణలో పెట్టి దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమాజంలో శాంతి–భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుత సేవలు అందించాల్సిన గొప్ప బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ వి. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారథి, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, ఏ.రేపల్లె డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ జి. నారాయణ, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అహ్మద్ జానీ, అద్దంకి టౌన్ సీఐ ఏ. సుబ్బరాజు, అద్దంకి రూరల్ సర్కిల్ సీఐ డి. మల్లికార్జునరావు, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, ఎమ్.టి ఆర్ఐ శ్రీకాంత్, తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది, డిపిఒ సిబ్బంది పాల్గొన్నారు.





