Friday, March 20, 2026

శాశ్వత షాపులు నిర్మాణం తర్వాతే షాపులు తొలగించండి* జిల్లా కలెక్టర్ కు కోరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్* వ్యాపారులకు నష్టం కలగకుండా చూస్తామని కలెక్టర్ హామీ

నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధిసూర్యలంక సముద్ర తీరం వద్ద శాశ్వత షాపులు నిర్మించి షాపులు ప్రస్తుతం ఉన్న వారికి కేటాయించిన తర్వాతే అభివృద్ధికి అడ్డంగా ఉన్న షాపులను తొలగించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తెలిపారు.సూర్యలంక సముద్ర తీరం వద్ద గల దుకాణాలు తొలగింపుతో జీవనోపాధి కోల్పోతున్న వ్యాపారస్తుల సమస్యలను స్వయంగా సూర్యలంక వెళ్లి అడిగి తెలుసుకున్నారు.వారు తెలిపిన సమస్యలను పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి షాపుల వారి తరుపున వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం అన్నం సతీష్ కలెక్టర్ తో మాట్లాడుతూ సూర్యలంక సముద్రతీరం వద్ద షాపుల వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న షాపులను తొలగించకుండా నూతనంగా నిర్మాణాలు చేపట్టి ప్రస్తుతం వ్యాపారాలు చేసుకునే వారికి నూతన షాపులు కేటాయించిన తర్వాతే ప్రస్తుతం ఉన్న షాపులను తొలగించుకోవాలన్నారు.ప్రస్తుతం పంచాయితీకి ఏ విధంగా అయితే అద్దెలు చెల్లిస్తున్నారో అదే రీతిలో నూతన షాపులకు కూడా అద్దెలు కేటాయించి వారికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. షాపుల వారి పూర్తి వివరాలను సేకరించుకునేందుకు స్థానికంగా ఉన్న సమస్యలను పూర్తిగా తెలుసుకునే విధంగా ఒక కమిటీని నియమించి కమిటీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. గత 40 సంవత్సరాలుగా సూర్యలంక తీరం వద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 97 కోట్లు నిధులు కేటాయించడం శుభపరిణామం అన్నారు. అభివృద్ధి చేయడం ఎంతో ముఖ్యమని అభివృద్ధిలో భాగంగా పేదలను కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ జీవన ఉపాధికి నష్టం కలగకుండా చూసుకోవలసిన అంశం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఎవరివైనా నివాస స్థలాలు పోతుంటే వారికి పక్క స్థలాలు చూపించి వారిని కాలి చేయించాలని చెప్పారు.సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కమిటీని వేసి పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని వ్యాపారులకు నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News