Friday, March 20, 2026

✍️ *ఎన్నికల కోడ్ – ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీలలో పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఫోటోలను,పోస్టర్లను వెంటనే తీసివేయాలి : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్**గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్*✍️ *75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తింపు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్**- మొదటి విడుతలో 7 మండలాలు, 122 గ్రామ పంచాయతీలు**- రెండవ విడుతలో 7 మండలాలు, 144 గ్రామ పంచాయతీలు**- మూడవ విడుతలో 6 మండలాలు,119 గ్రామ పంచాయతీలు* ———————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను పూర్తి శాంతియుత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిప్యూటి ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడుతలలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ నిన్న సాయంత్రం ప్రెస్ రిలీజ్ చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీలలో పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఫోటోలను, పోస్టర్లను వెంటనే తీసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. *మొదటి విడుతలో కోరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాలు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్ పల్లి, వేములవాడ నియోజకవర్గంలోని 3 మండలాలు మేడిపల్లి, కథలాపూర్, భీమారం*ఫేజ్-1 లో మొత్తం 122 గ్రామాలలోని 1172 వార్డులకు డిసెంబర్ 11 న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.*రెండవ విడుతలో జగిత్యాల నియోజకవర్గంలోని 5 జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, చొప్పదండి నియోజకవర్గంలో 2 మండలాలు మల్యాల, కొడిమ్యాల*ఫేజ్-2 లో 144 గ్రామలలోని 1276 వార్డులకు డిసెంబర్ 14 న ఎన్నికల నిర్వహణ *మూడవ విడుతలో ధర్మపురి నియోజకవర్గంలోని 6 మండలాలు ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి* లకు సంబంధించి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫేజ్-3 లో 119 గ్రామంలోని 1088 వార్డులకు డిసెంబర్ 17 ఎన్నికల నిర్వహణ 3 నుండి 4 గ్రామ పంచాయతీలకు కలిపి క్లస్టర్ల వారీగా ఒక ఆర్వో, ఏఆర్వోలను నియమించామని, ఇందుకు సంబంధించి ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. 75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించి సిసి టీవి పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 6,07,263 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 2,89,702 కాగా, మహిళలు 3,17,552 కాగా ఇతరులు 9 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. మొదటి విడుతలో నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు మూడు రోజుల పాటు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏ.ఈ.ఓ (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షిస్తారని అన్నారు. ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయుటకు తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. *జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ* గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుటకు ఎన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాన్ని తనిఖీలు నిర్వహించే నేపద్యంలో డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పోస్టర్లను రవాణా చేసే సమయంలో తగిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News