నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండలం నూతన ఎమ్మార్వో గా హుజురాబాద్ మండలం నుండి బదిలీ పై వచ్చిన కోడెం కనుకయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బోడ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువా తో ఘనంగా సన్మానించారు. ఇక్కడ పని చేసిన ఎమ్మార్వో నరేందర్ హుజురాబాద్ బదిలీ పై వెళ్లారు. ఎమ్మార్వో ను సన్మానించిన వారిలో డిప్యూటీ తాసిల్దార్ ప్రణయ్ ,గిర్దవార్లు ప్రవీణ్ , రఘు ,సీనియర్ అసిస్టెంట్ శ్రీనాథ్ , మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.





