( నేటి సాక్షి)నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి పద్మశాలి యువ నాయకుడు పున్న కైలాష్ నేతకు అవకాశం ఉన్నవచ్చిన్న నేపథ్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గాజులరామారం పద్మశాలి సంఘం ప్రకటన విడుదల చేసింది.పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ, కైలాష్ నేత రాజకీయంగా ముందుకు రావడాన్ని అడ్డుకునేందుకు “రాజకీయ ఈర్ష్యతో చర్యలు తీసుకుంటున్నారని” ఆరోపించారు. ఈ చర్యలు సమాజం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి పద్మశాలికి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ “పద్మశాలి సమాజం నుండి ఎదుగుతున్న ప్రతిభావంతుల నాయకులను ఓర్చుకోలేని స్వార్థపూరిత, అగ్ర వర్గాల నేతల వైఖరి అసహన దృక్పథానికి నిదర్శనం. మన నాయకుల ఎదుగుదలకు అడ్డుపడే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని పేర్కొన్నారు.అదే సందర్భంగా పున్న కైలాష్ నేతకు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా సమాజం ఐక్యంగా ఉండి, పద్మశాలీల రాజకీయ ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.సంఘం నేతలు రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్‌కి పిలుపునిస్తూ, “పద్మశాలి సమాజం భావాలను గౌరవించాలి. మనస్ఫూర్తిగా పనిచేస్తున్న నాయకులపై అన్యాయ ఆరోపణలు, కుట్రలు సహించబోవు” అని తెలిపారు.పద్మశాలి సమాజం హక్కులకూ, పద్మశాలి యువ నేతల ఎదుగుదలకు అడ్డుపడే చర్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటామని హామీ ఇచ్చారు.





