నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)జాతి, మత,కులలకే కాకుండా 84లక్షల జీవ రాసులకు భగవంతుడు శ్రీ శ్రీకృష్ణడు అనిభారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా, బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో శ్రీ రాధాసమేత శ్రీకృష్ణ స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి భావం నిండిన వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ పూజా, ఆశీర్వాద కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సమాజానికి శాంతి, అభివృద్ధి చేకూరాలని, ప్రతి ఇంటా సౌఖ్యం నిండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు.ఉత్సవ ప్రాంగణానికి భారీ సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు తరలివచ్చి స్వామివారి దివ్యదర్శనం చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందభరితులయ్యారు. భజనలతో, కీర్తనలతో, “గోవింద… గోపాల… కృష్ణయ్యా” నినాదాలతో గ్రామం అంతా ఉత్సాహంగా మారిపోయింది.తదుపరి గ్రామం లో అన్నదానం చేసారు.ఈ కార్యక్రమం నక్కల వెంకట స్వామి, సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.





