Friday, March 20, 2026

*రాజ్యాంగ రూపకర్తలు చూపిన దారిలో ప్రతి ఒక్కరు నడవాలి** జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిరాజ్యాంగ రూపకర్తలు చూపిన దారిలో ప్రతి ఒక్కరు నడవాలనిజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ అన్నారు.బాపట్లజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిరు.ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సేవలు శాశ్వతముగా స్మరణీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News