నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………..ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ రాతలు, వాల్‌పోస్టర్, ఫ్లెక్సీ బ్యానర్లు తొలగించాలని సూచించారు. ఎన్నికలు జరుగు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలకు లోబడి ఎన్నికల ఖర్చును వినియోగించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎన్నికల ప్రచార కరపత్రాలపై తప్పనిసరిగా ప్రింటర్ల సమాచారం ఉండాలని రాజకీయ పార్టీలకు సూచించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం లో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సంహకరించాలని కోరారు.ఈ సమావేశంలో డిప్యూటీ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎన్నికల విభాగం మరియు తదితరులు పాల్గొన్నారు.





