నేటిసాక్షి, మిర్యాలగూడ : అంగన్వాడీ టీచర్స్ వారి యొక్క పరిధిలో బ్రూణ హత్యలు, శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిడబ్ల్యూఓ కృష్ణవేణి అన్నారు. ఐసిడిఎస్ మిర్యాలగూడ అర్భన్ ప్రాజెక్ట్ పరిధిలోని, సీడీపీఓ మమత ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్ట్ సమావేశాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిడబ్ల్యూఓ కృష్ణవేణి, పట్టణ వన్ టౌన్ ఎస్సై సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిడబ్ల్యూఓ కృష్ణవేణి మాట్లాడుతూ, లబ్ధిదారులకు అందించే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ఎప్పటికప్పుడు ఆహారం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని, బ్రూణ హత్యలు, శిశు విక్రయాలు, బాల్యవివాహాలు అరికట్టాలని సూచించారు. అనంతరం సీడీపీఓ ఆర్.మమత మాట్లాడుతూ, నెలవారీ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు సెంటర్ పరిశుభ్రంగా ఉంచుకోవడం, సమయపాలన పాటించడం, పిల్లల ప్రీ స్కూల్ విషయంలో తగు జాగ్రత్తలు, నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను పిల్లలకు అందించాలని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఎన్ ఎచ్ టిఎస్ మరియు పోషన్ ట్రాకర్ యాప్ లలో రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవలెనని వివరించారు. చట్టపరమైన దత్తత మిషన్ వాత్సల్య వెబ్సైట్ గురించి వివరించారు. అదేవిధంగా టీచర్స్ సెంటర్స్ పరిధిలోని ప్రజలకు చట్ట పరమైన దత్తత గురించి అవగాహన కల్పించవలసిందిగా టీచర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ లు ఎస్. రాధిక, నజీమా బేగం మొహ్మద్, వాణి, లీలాకుమారి, నిహారిక, హేమాదేవి, నాగమణి,జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుండి రమణి, ఆశ్రిత ఎన్జీవో శోభ, కవిత, బ్లాక్ కో-ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.





