Friday, March 20, 2026

*మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త తొలగించండి.**ఇంచార్జి జాయింట్ కలెక్టర్,కమిషనర్ ఎన్.మౌర్య*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)నగరంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త, మట్టి తొలగించాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 19వ వార్డు లోని దుర్గానగర్, శేషాద్రి నగర్, పోలీస్ క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్స్ లలో కార్పొరేటర్ ఆరని సంధ్య, అధికారులతో కలసి కమిషనర్ తనిఖీ చేశారు. మీ ఇంటికి చెత్త బండి వస్తోందా? కాలువలు శుభ్రం చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా చెత్త, మట్టి తొలగించాలని, అక్కడక్కడా పాడైపోయిన మురుగు కాలువలు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న గడ్డి, ముళ్ల కంపలను తొలగించాలని తెలిపారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయడం వలన మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని, కావున మీ ఇంటికి వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.మహేష్, ఏసిపి మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News