Friday, March 20, 2026

గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్…. …కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 163 బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలు…..

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 27,నారాయణపేట జిల్లా పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ దశను పూర్తిగా శాంతియుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అశాంతి, అవకతవకలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది న్హై అలర్ట్‌లో ఉన్నట్టు తెలిపారు. *నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు:* •జిల్లాలోని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.•ప్రతి కేంద్రం వద్ద SI, CI లు, డీఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది అని అన్నారు.•కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమల్లో ఉంటుంది.•అనుమతి పొందిన అభ్యర్థులు మరియు వారి సహాయకులకు మాత్రమే ప్రవేశం.•జనసమ్మర్దం, అనవసర గుంపులు, అతి ఉత్సాహ చర్యలపై కఠిన చర్యలు. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు: • ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమలులోకి వచ్చినట్టు ఎస్పీ గారు తెలిపారు.• రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు చట్టం ప్రకారం ప్రవర్తించావలెను. *చెక్‌పోస్టులు & వాహన తనిఖీలు:* •జిల్లా సరిహద్దు లో 05 బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద మరియు ప్రధాన రహదారుల పై తనిఖీలు మరింత బలోపేతం చేయడం జరిగిందని, అక్రమ నగదు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.•నగదు మరియు విలువైన వస్తువులు తీసుకెళ్ళేటపుడు సంబంధిత రసీదు తప్పనిసరి.. *నివారణ చర్యలు :* •గత ఎన్నికల్లో సమస్యలకు కి కారణమైన వ్యక్తులపై రెవెన్యూ అధికారుల సమక్షంలో బైండ్‌ఓవర్ చర్యలు.•జిల్లాలో ఉన్న అన్ని లైసెన్స్ ఆయుధాలు తాత్కాలికంగా స్వాధీనం.•ట్రబుల్ మేకర్లు, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా.*పర్యవేక్షణ & పెట్రోలింగ్:* •మండలాల వారీగా ప్రత్యేక నిఘా బృందాలు.•24×7 పెట్రోలింగ్ ఉంటుందని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్ 100, జిల్లా కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి.సోషల్ మీడియా నిఘా: •ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, ద్వేషపూరిత కామెంట్‌లపై కఠిన చర్యలు.•వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు బాధ్యత వహించాలి •రూమర్లు పంచే వారిపై క్రిమినల్ కేసులు నమోదు.అభ్యర్థులకు ముఖ్య సూచనలు: అనుమతి పొందిన వాహనాలే వినియోగించాలి.•లౌడ్‌స్పీకర్ వాడకానికి ముందస్తు అనుమతి తప్పనిసరి.•ర్యాలీలు కుల–మత విభేదాలు రేకెత్తించేలా ఉండకూడదు.•నామినేషన్ కేంద్రానికి అభ్యర్థి + అనుమతి పొందిన సహాయకులకే ప్రవేశం.గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించగలరని మనవి ”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News