Friday, March 20, 2026

*అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి** గుంటూరు పశ్చిమలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి* రూ.16.44 కోట్ల పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

నేటి సాక్షి, గుంటూరు జిల్లా ప్రతినిధి అభివృద్ధి ,సంక్షేమం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యులు గళ్ళ మాధవి అన్నారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రలు నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో మొత్తం ₹16.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ రవీంద్ర పాల్గొని శంకుస్థాపన చేసి పనులును ప్రారంభించారు. ఈ తెలుగు స్థాపన రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, వాటర్ పైప్‌లైన్లు వంటి కీలక మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంటూరు పశ్చిమలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని,8 డివిజన్లలో 16 కోట్లకు పైగా అభివృద్ధి పనులకి ఒకే రోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ప్రజలు కోరిన ప్రతి అభివృద్ధి పనిని వెంటనే అంచనాలు తయారు చేయించి మంజూరు చేయడంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.కాంట్రాక్టర్లు తీసుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి. అలాగే కార్పొరేషన్ బిల్లులు కూడా వేగంగా క్లియర్ చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర ను కోరుతున్నాను” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.39వ డివిజన్‌లో మాత్రమే సుమారు ₹ 3 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని, గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి రత్నగిరి, పలకలూరు ప్రాంతాల వరకు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.అభివృద్ధి–సంక్షేమం రెండూ మా పశ్చిమ నియోజకవర్గంలో రెండు కన్నుల్లా ముందుకు సాగుతున్నాయి. ప్రజల కోసం నిరంతరం పనిచేయడం కూటమి ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బీజేపీ పార్టీల డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*డివిజన్ వారీగా శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు*21వ డివిజన్ – ₹1.57 కోట్లు23వ డివిజన్ – ₹2.74 కోట్లు25వ డివిజన్ – ₹1.14 కోట్లు29వ డివిజన్ – ₹1.82 కోట్లు30వ డివిజన్ – ₹24.5 లక్షలు33వ డివిజన్ – రోడ్లు, డ్రెయిన్లు – ₹4.24 కోట్లు35వ డివిజన్ – ₹1.25 కోట్లు39వ డివిజన్ – ₹3.43 కోట్లుమొత్తం: ₹16.44 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News