నేటి సాక్షి శ్రీధర్ దమ్మ (మంచిర్యాల్) నవంబర్ 27 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన శనిగారపు రాజయ్య (35) కూతురు మహాన్విత ( 7) నవంబర్ 23 ఆదివారం రాత్రి సుమారు 7:00 గంటల సమయంలో ఇంటిముందు ఆడుతూ ఉండగా తల్లిదండ్రులు చాయ్ తాగడానికి పిలువగా వారితో కలిసి టీ తాగి మళ్లీ ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది కొంచెం సమయం తర్వాత తల్లిదండ్రులు వచ్చి చూడగా కూతురు కనపడకపోవడంతో చుట్టుపక్కల వెతికి చూసిన ప్రయోజనం లేక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఎస్సై తహసీనుద్దిన్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు తన పై అధికారులకు కూడా సమాచారం ఇచ్చి వెంటనే డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపి పరిసరాల ప్రాంతాల్లో తిరిగిన ఎటువంటి ఆధారం దొరకలేదు.తన పై అధికారుల మేరకు స్పెషల్ టీం గా ఏర్పడి చిన్నారి ఆచూకీ కోసం వెతికి పని వేగవంతం చేశారు ఆనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఎవరైనా చిన్నారిని చూసిన ఎక్కడైనా కనపడిన వెంటనే దండేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగలరని కోరారు. ఈరోజు అనగా గురువారం నవంబర్ 27ఇంటి సమీపంలోని బావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మరియు వారి సిబ్బంది. బాలిక నోట్లో గుడ్డ కుక్కి నడుముకి బండరాయి కట్టి బావిలో పడేసి హత్య చేసినట్టు తెలిపారు. దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకుంటాము అని చెప్పారు.





