నేటి సాక్షి – మేడిపెల్లి*( రాధారపు నర్సయ్య )వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం మేడిపెల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్… రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. కేంద్రాల్లో తూకం పద్ధతి, ధాన్యం స్వీకరణ, రైతులకు అవసరమైన సదుపాయాలపై సమగ్రంగా విచారణ చేశారు.*తేమ శాతం తప్పనిసరి – నాణ్యతపై సడలింపు లేదు*కొనుగోలు కేంద్రాలకు చేరే ప్రతి వరి ధాన్యాన్ని తప్పనిసరిగా 17% తేమ శాతంతోనే స్వీకరించాలని అధికారులు పాటించాల్సిన నిబంధనలను కలెక్టర్ మరోసారి గుర్తు చేశారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్నే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఏ విధమైన నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. రైతులు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం తీసుకు రావాలని సూచించారు.*కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి*కొనుగోలు కేంద్రాల్లో చేరిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వాహనాల ద్వారా రైస్‌మిల్లులకు తరలించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. క్లస్టర్ అధికారులకు కేటాయించిన కేంద్రాల్లో యంత్రాల పనితీరు, ధాన్యం తూకాలు, కొనుగోలు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు._____





