Friday, March 20, 2026

అతివేగం వద్దు – నిదానమే హద్దు

నేటి సాక్షి ,బాపట్ల జిల్లా, (బాపట్ల రూరల్)రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఎంతగానో ఉపయోగపడతాయని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు కోళ్లపూడి కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని సూర్యలంక రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ హెచ్చరిక బోర్డును ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ వాహన దారులు నిదానంగా ప్రయాణించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ బాపట్ల పట్టణం మీదుగా జాతీయ రహదారులు వెళ్లడం ద్వారా సుధీర్ఘ ప్రాంతాల నుంచి అతివేగంగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి వాహనదారులలో అవగాహన కల్పించడం కోసం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సహాయ సహకారాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అతివేగం కారణంగా రహదారులపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అతివేగ నియంత్రణ కోసం సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని యువత అతివేగంగా వాహనాలు నడపకుండా అధికారులు తెలిపే సూచనల మేరకు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, సంయుక్త కార్యదర్శి బొగ్గవరపు శివ, కోశాధికారి జోగి సువర్ణరాజు, సభ్యులు కోడి రెక్క రవి, భీమా కోటేశ్వరరావు,నరాలశెట్టి నాగరాజు,పెద్దమళ్ళు శ్రీకాంత్, తన్నీరు గోపి,కొత్త మల్లికార్జునరావు,చామర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News