నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )గురువారం రోజున సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలను అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత సందర్శించారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర (రెవిన్యూ) విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, పిల్లలతోపాటు ఉపాధ్యాయులు కూడా కలిసి భోజనం చేయాలని తెలిపారు. కచ్చితంగా మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తూ రిజిస్టర్ నమోదు చేస్తూ చేస్తున్నారా లేదా రిజిస్టర్ను పరిశీలించారు. రోజువారి భోజనం బాగుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులందరూ మంచిగా చదువుకొని పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు తెలిపారు. పాఠశాల చదివే పిల్లల పట్ల మనం బాధ్యతతో ఉండాలని చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలకు రాని విద్యార్థుల వివరాల, తగిన కారణాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపారు *విద్యార్థిని ఇంటికెళ్లిన అదనపు కలెక్టర్*పాఠశాలకు సరిగ్గా హాజరు కాని విద్యార్థిని పచునూరి అక్షిత ఇంటికి అదనపు కలెక్టర్ ప్రత్యక్షంగా వెళ్లి బడికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి అక్షిత ను ప్రతిరోజు బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ తహసిల్దార్ వహియొద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.*కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి*ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత తెలిపారు. గురువారం రోజున సారంగాపూర్ మండల కేంద్రంలో కోనాపూర్, ఆర్పపల్లి, ధర్మానాయక్ తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్క పేట గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. *ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ* కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకం ధాన్యం 17 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని స్పష్టం చేశారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి రెండు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే విధంగా చూడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వహీయోద్దీన్, సివిల్ సప్లై అధికారులు, సెంటర్ ఇంచార్జులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.——





