నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………….బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో గీత విద్యాలయం పాఠశాలలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు మరియు సభ్యులు పాల్గొని స్థానిక గీత విద్యాలయం ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే వందేమాతర గీతాన్ని ఆలపింపజేశారు.ఈ సందర్భంగా భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వందేమాతర గేయం భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చిన గేయమని 1875లో బంకించంద్ర చటర్జీ దీని రాశాడని ఇప్పటికీ 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వము ఉత్సవాలను నిర్వహిస్తుందని ప్రతి భారతీయుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథ కార్యదర్శి సింగం గంగాధర్ ఉపాధ్యక్షుడు వేముల పోచమల్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ నరేందుల శ్రీనివాస్ గాదాసు భూమన్న కొత్తకొండ బాలన్న తునికి అంజన్న ఆర్ఎస్ఎస్ వీరన్న బొందుకూరి శ్రీనివాస్ గీత విద్యాలయం ప్రధానోపాధ్యాయులు శివకుమార్ మరియు వారి ఉపాధ్యాయ బృందం ,అశోక్ రావు వద్దినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.





