నేటిసాక్షి, మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి ప్రోగ్రాం లో భాగంగా సేద్యంలో ఉండి పట్టా కానటువంటి రైతులందరూ దరఖాస్తు చేసుకొని, మండలంలోని దామరచర్ల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగిన పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణామని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంభయ్య లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భూభారతిలో పట్ట కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి అనేక మంది రైతులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి రైతుల కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా, ఇంతవరకు పట్టా చేయకపోవడం పట్ల రైతులు నరకయాతన అనుభవస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారు. కార్యాలయంలో రైతులు నేరుగా అధికారుల దగ్గరికి వెళ్లి కలిసినప్పటికీ పని కాకపోవడం వలన ఏజెంట్ల ద్వారా వెళ్తేనే పని అవుతుందని రైతులు అనుకుంటున్నారని అన్నారు. కార్యాలయంలో అసలు రెవిన్యూ ఉద్యోగులు పక్కనపెట్టి ఏజెంట్లే ఈ భూభారతి ఫైళ్ళని మొత్తం చూస్తుండడం వలన, అసలు రెవిన్యూ ఉద్యోగులకు పని లేకుండా పోతుందని, భూభారతిలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి రైతులు ఏజెంట్ల ద్వారా వ్యక్తిగతంగా అధికారులను కలిస్తేనే వారి యొక్క ఫైళ్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంకు పంపుతున్నారని, ఎవరైతే రైతులు కలవకుండా సర్వే అయిపోయిందని, ఇంక మాకు ఏ ఇబ్బంది లేదు పట్టా వస్తది అని అనుకుంటున్నారో వారి యొక్క ఫైలు తాసిల్దార్ కార్యాలయంలోనే పెండింగ్లో ఉండటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విధంగా దామరచర్ల తహశీల్దార్ కార్యాలయం లోకి సామాన్య ప్రజలు నేరుగా వెళ్లి పని చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ఈ విషయం పట్ల రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, వారి వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, భూభారతిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి తహశీల్దార్ కార్యాలయంకి వెళ్లకుండానే పట్టా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్డీ ఖాదర్, సోషల్ మీడియా కో కన్వీనర్ ఎస్ కే సద్దాం, బీసీ సంఘం నాయకులు మధు గౌడ్, బిసి యోజన సంఘం మండల అధ్యక్షులు ఎర్ర మాద కుమార్, అశోక్, రమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.





