Friday, March 20, 2026

చౌడేపల్లి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఎవరు O.c S.c B.c … రేసులో ఏడు మంది

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 28 :కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటాం శాప్ చైర్మన్ రవి నాయుడుచౌడేపల్లి మండలం శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో టిడిపి మండల పార్టీ సర్వసభ్య సమావేశం జరిగేలా రాష్ట్ర పార్టీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాలతో గువ్వల రమేష్ రెడ్డి వర్గం బోయకొండ లో సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి నాయకులు లక్ష్మణ్ రాజు (పత్తి రాజు) వర్గం షెడ్యూల్ ప్రకారం శ్రీనివాస కళ్యాణం మండపంలో సమావేశం నిర్వహించారు. మొదట బోయకొండలో కార్యక్రమం నిర్వహించి అనంతరం చౌడేపల్లిలోని కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. కష్టకాలలో పార్టీకి అండగా ఉన్నవారికి, కేసుల్లో ఉన్నవారికి ,గత వైసిపి ప్రభుత్వం లో బాధితులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ అవసరమైతే కొన్ని నామినేటెడ్ పదవులను అధిష్టానం నుండి మాట్లాడి కార్యకర్తలకు న్యాయం జరిగేలా అందర్నీ గుర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, గువ్వల రమేష్ రెడ్డి ,లక్ష్మణ్ రాజు, ప్రదీప్ రాజు ,సింగల్ విండో చైర్మన్ హరిరాయల్ ,సీనియర్ నాయకులు నారాయణరెడ్డి ,పార్థసారథి ,నాగభూషణం, కుమార్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపి పార్టీ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అంటూ చిన్నపాటి గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గానికి బలుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తులను నియోజవర్గంలోని అన్ని మండలాలలో బీసీ, ఎస్సీ, మైనారిటీ సామాజిక వర్గాలకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని పలువురు కార్యకర్తలు కోరారు.టీడీపీ సంస్థాగత కమిటీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ మండలాధ్యక్ష పదవికి 7 వినతులు వచ్చినట్లు అబ్జర్వర్ పాల ఏకిరి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కందూరి నాగేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. ఆయన మండల కమిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మాట్లాడుతూ… పార్టీ అధ్యక్ష పదవి కోసం గత ఐదేళ్ల నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గువ్వల రమేష్ రెడ్డి, లక్ష్మణరాజు, గంగాధర్రెడ్డి, నరేష్ బాబు, రామకృష్ణ, పార్థసారథిలు , మహేష్ బాబు తో కలిపి 7 మంది, గంగరాజు ఉపాధ్యక్ష పదవి కోసం వినతి పత్రాలు సమర్పించారు. అర్జీలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపి ఐవీఆర్ఎస్ పద్ధతిలో మండల పార్టీ అధ్యక్షుడి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యకర్తల పైనే అక్రమ కేసులు పెడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చౌడేపల్లె మండలంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి సమస్యలను తన దృష్టికి నారా లోకేష్ పేరుతో వినతి అర్జీలు ఇస్తే ఆయనకు అందించనున్నట్లు తెలిపారు. మంత్రి స్వయం గా ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కరింస్తారని హామి ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News