నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*శ్రీ రంగరాజపురం* మండలంలోని నెలవాయి పంచాయతీ నందవనం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి గురువారం రాత్రి గుండెపోటుకు గురై అకస్మాత్తుగా మరణించడం జరిగింది. సమాచారం అందుకున్న గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి రామ్మూర్తి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటే కన్నీటి పర్వతమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సిపి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎవరు ఆధైర్య పడవలసిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ మణి, ఎంపీపీ సరిత జనార్ధన్, జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య , మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సామ్రాజ్, స్థానిక సర్పంచ్ జయలక్ష్మి కుమార్,నాయకులు భూపతిరెడ్డి, మణి, మహేష్, సీనయ్య, రాజేంద్ర, సిద్దయ్య, బాబు, రామచంద్ర యాదవ్, మదన్, ఉమాపతి తదితరుల నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.





