నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ *బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్* *బహుజనుల ఆరోగ్యదేవ మహాత్మ జ్యోతిరావు పూలే అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపనర్ రమేష్ అన్నారు కొమురం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ లో గల మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ మాట్లాడుతూ చదువుతోనే సమాజం మార్పు బహుజనుల చదువు కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి బహుజనులకు చదువుకునే వీలు కల్పించారని అందరికి సమాన విద్య,అంటరానితనం పై ఎంతో పోరాటం చేసారన్నారు* ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు రేగుంట కేశవ్ గారు జిల్లా బీసీ సంక్షేమ సంఘం రైతు అధ్యzక్షుడు వైరాగడి మారుతి పటేల్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గురునులే మేంగాజీ, మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు న్యాయవాది నీకుడే రవీందర్ గారు, అఖిలభారత మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నా గోశే శంకర్ గారు, వాంకిడి మాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాబురావు గారు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్ గారు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు షేక్ అసాద్ గారు, కోలాం సంఘ జిల్లా అధ్యక్షుడు జలపతి గారు, లుంబిని దీక్ష భూమి మాజీ అధ్యక్షులు దుర్గం తిరుపతి గారు, షిండే రాందేవ్ గారు, పులగం వెంకన్న గారు వివిధ మండలాల మాలి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు





