మహిళా సంఘాల సభ్యులు ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలి-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠినేటిసాక్షి, నల్లగొండ : నూతన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించిమహిళ సంఘాల సభ్యులు ఆర్థికంగా మరింత ముందుకు ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.శుక్రవారం జిల్లా నుండి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న “భారతీయ కళా మహోత్సవ్” కు జిల్లా నుండి వెళుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సు కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కళా మహోత్సవ్ లో దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారుచేసిన పలు రకాల ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుందని, అలాంటి స్టాల్స్ ను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సందర్శించడం వల్ల విభిన్న ఉత్పత్తుల తయారీపై అవగాహన కలుగుతుందని, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు, ఆర్థిక అంశాలతో పాటు, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు నూతన ఆలోచనలతో కొత్త ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించాలని, తద్వారా మరింత ఆర్థికంగా ఎదిగే ఆకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





