Friday, March 20, 2026

*చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల )చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ‌శ్రీ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ,జిల్లా అధికారులు జెడ్ పి సీఈఓ రవికుమార్ నాయుడు,పి ఆర్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ లు చంద్రశేఖర్ రెడ్డి,విజయ్ కుమార్,డ్వామా,హౌసింగ్ పిడి లు ,డిఇఓవరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకట రమణ,డి ఆర్ డి ఎ పిడి శ్రీదేవి,జిల్లా వ్యవసాయ,ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, సీపీఓ శ్రీనివాసులు ఎల్డిఎం హరీష్,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డిపిఓ ప్రభాకర్ రావు,డిఎంఎచ్ఓ సుధారాణి,డి ఎస్ ఓ శంకరన్,చిత్తూరు మున్సిపల్ కమిషనర్ సంబంధిత జిల్లా అధికారులు హాజరు అయ్యారు.కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి, శాఖల వారీగా అధికారులతో సమీక్షించి, ఎంపి దిశా నిర్దేశం చేసారు అర్హులైన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపీ సూచించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News