నేటి సాక్షి వికారాబాద్:ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సంఘాల పితామహులు మహాత్మ బుద్ధుడు అయితే ఆయన వారసత్వాన్ని పొందిపుచ్చుకొని ఆయన ఆలోచన విధానాన్ని యావత్ భారతావానికి పరిచయం చేసిన మహాత్ముడు, సంఘసంస్కర్త, ఈ దేశంలో ని శూద్రులకు అక్షరం నేర్పడం మొదలుపెట్టిన మహా గురువు, అంబేద్కర్ గురువు.. మహాత్మ జ్యోతిబాపూలే.. భారతదేశంలో రాచరిక వ్యవస్థను మరిచిపోయే విధంగా ప్రజాస్వామ్యానికి పునాదులు వేసే దిశగా ఆయన ఆలోచన విధానంతో ఎన్నో సంస్కరణలు ఈ దేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే…. ఆయన వల్లే ఈ దేశంలోని శూద్రులు, బడుగు బలహీన, వర్గాలు అక్షరం నేర్చుకోవడానికి అవకాశం దొరికింది అని మాట్లాడుతూ… శుక్రవారం స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన ఆఫీసులో మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొంపల్లి వెంకటేష్, బొంపల్లి గ్రామ అధ్యక్షులు మల్లేష్ టి శ్రీనివాస్ కొనగల నర్సింలు, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





