నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి: 28/11/2025పుంగనూరు పట్టణంలోని న్యాయవాదుల సంఘ జాయింట్ సెక్రటరీ పదవికి ప్రశాంతి రాజీనామ చేస్తూ శుక్రవారం అధ్యక్షుడికి లేఖను పంపారు. కాగా పుంగనూరులో న్యాయవాదుల సంఘ భవనానికి రూ.1.50 కోట్లతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలు నిధులు కేటాయించి, భవనాన్ని నిర్మించారు. ఇలా ఉండగా అధికారులు , కొంత మంది న్యాయవాదులు కలసి ప్రోటోకాల్ లేకుండ భవనాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే సంఘంలో జాయింట్ సెక్రటరీకి సమాచారం ఇవ్వకుండ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో ప్రశాంతి మనస్థాపానికి గురైన రాజీనామ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా న్యాయవాదుల సంఘంలో ప్రశాంతి రాజీనామ తీవ్ర చర్చనీయాంశమౌతోంది. న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయేరని చర్చించుకుంటున్నారు.




