నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) *తిరుపతి రూరల్*తిరుపతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. నీరజ.ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ (ఆర్ వై ఎస్ ఎస్,) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. నీరజ శుక్రవారం తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం, వేమూరు క్లస్టర్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ రైతు దామా అయ్యప్ప నాయుడు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.. ఈ సందర్భంగా జిల్లారైసా అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం’’ (ఎపిసిఎన్) ద్వారా అమలు జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనా క్షేత్రాలను పరిశీలించారు. రైతు పొలంలో సాగు చేస్తున్న ఏటీఎం, ఏ-గ్రేడ్, పీఎండీఎస్, నూతన విధానం లో సాగు చేస్తున్న వివిధ స్టేజ్ లో ఉన్న చెరుకు పంటలను నమూనా పంటలను పరిశీలిచి రైతుతో ప్రత్యక్షంగా చర్చించారు. అంతేకాకుండా జీవామృతమును ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ గా మొక్కలకి అందించే వినూత్న విధానాన్ని కూడా పరిశీలించి ఆ విధానంపై చర్చించడం జరిగింది. ఈ విధానాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తున్న పంటల పెట్టుబడి వ్యయం, దిగుబడి, ఆదాయం వివరాలు, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతును భాగస్వామ్యం చేయాలని, ఈ విధానం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.ప్రకృతి వ్యవసాయం వలన వాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి పెరగడంతో పాటు, రైతులకు అనేక లాభాలు చేకూరుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సాగు వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుందని, నేల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీపీఎం షణ్ముఖం, అదనపు డీపీఎం పట్టాభి రెడ్డి, జిల్లా యాంకర్ రవిచంద్ర ప్రసాద్ ఎన్ఎఫ్ఏ గీతారాణి తదితరులు పాల్గొన్నారు.





