Friday, March 20, 2026

*ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి** ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి* జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించడం జరిగిందని తెలిపారు.శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. *రూ.50 వేలకు మాత్రమే అనుమతి*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం గ్రామ ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉన్నదని, 50 వేలకు పైబడి ఉన్న నగదు కు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, స్పెషల్‌ టీమ్‌ల పాత్ర ఎలా ఉంటుందనే విషయాలపై వివరించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఈ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ప్రత్యేక బృందాల్లో తప్పనిసరిగా మెజిస్ట్రేట్‌ స్థాయి అధికారి ఒకరు, నలుగురు పోలీసు సిబ్బంది, అవసరమైతే కెమెరామెన్‌/వెబ్‌క్యామ్‌ సామగ్రి, ప్రత్యేక వాహనం ఉంటాయి. ఎన్నికల అధికారులు, పోలీసులకు వచ్చే సమాచారం, పౌరులు చేసే ఫిర్యాదుల ఆధారంగా వీరి కార్యాచరణ ఉంటుంది. *ప్రలోభాలపై ఫ్లైయింగ్ స్క్వాడ్ దృష్టి పెట్టాలి*ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నాయకులు పెట్టే ప్రలోభాలు, ఇచ్చే బహుమతులు, పంచే డబ్బులు, మద్యం వంటి వాటిపై కూడా ఈ ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు దృష్టిసారించాలని సూచించారు. తమ గ్రామ పంచాయతీ పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌లు, ఎన్నికల ఏర్పాట్లు, ప్రక్రియను వీరు పరిశీలిస్తారని, అవసరమైతే స్థానిక అధికారులకు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తారని పేర్కొన్నారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ల విధి నిర్వహణ ఎప్పటికప్పుడు కెమెరాలో రికార్డు అవుతుందని, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని ఎం.సి.సి లో ఎఫ్.ఎస్.టి, వి.ఎస్.టిలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిన వారిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక అందించేలా సిబ్బందికి సూచనలు చేశారు. *జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..*ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, వారిని జి.పి.ఎస్ ట్రాక్ సిస్టం ద్వారా నిరంతరాయంగా పరిశీలిస్తామని తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల నిర్వహణలో భాగంగా మద్యం, లిక్కర్ తదితర వస్తువులు పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ వీడియో రికార్డ్ తప్పనిసరిగా చేయాలి తెలిపారు. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రి పై వీడియో సర్వేలెన్స్ టీమ్‌లు రికార్డు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ లు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించాలని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ కు సమర్పించాలని తెలిపారు. ఈ సెల్ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదు ను సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉంది అన్న సమాచారం అందిన వెంటనే ఇన్ కం ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని తెలిపారు.*ఫ్లైయింగ్ స్క్వాడ్ వాహనాల ప్రారంభం*అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఫ్లయింగ్ స్కాడ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ ఎం. మనోహర్, జిల్లా మరియు నోడల్ అధికారులు రఘువరన్, మదన్ మోహన్, బి.నరేష్, పి. నరేష్, రేవంత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News