( నేటి సాక్షి )ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి గండి మైసమ్మ లోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారి అధ్యక్షతన నిర్వహించిన “దీక్షా దివాస్” కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ తో పాటుగా ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ లు పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధకులు, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అడుగడుగున అవమానాలు, వివక్షతకు గురైన ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా ఆవిర్భవించిన తెలంగాణను పదేళ్ల కాలంలో దేశంలోనే అగ్రపథాన నిలిపిన దార్శనికులు, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం తమ పదవులను సైతం తృణప్రాయంగా వదిలేసిన గొప్ప నాయకులు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తీరును, ఉద్యమ పంథాను నేటి యువతకు తెలియజేయాలన్నారు. రానున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ని మరోమారు సీఎం చేసే వరకు ప్రతీ నాయకుడు, కార్యకర్త ఒక దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





